తాబేళ్ల ప్రాముఖ్యతలను ప్రపంచానికి తెలియజేసే లక్ష్యంతో ఏటా మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఇవి సముద్ర పర్యావరణానికి చాలా ముఖ్యమైనవి. జెల్లీ ఫిష్‌లు, స్పాంజ్‌ల జనాభాను నియంత్రిస్తాయి.
ఇవి భూమి, జలావరణంలో నివసిస్తాయి. తాబేళ్ల గురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
తాబేళ్లను, వాటి జాతిని పరిరక్షించే ఉద్దేశంతో 1990లో అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ (ఏటీఆర్) ఏర్పడింది. తాబేళ్ల రక్షణ, పునరావాసం లాంటి చర్యలు ఇది నిర్వహిస్తుంది.
వాటి ఆవాసాలను రక్షించి, మనుగడ - వృద్ధికి సాయపడేలా మానవ చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటీఆర్ సంస్థ ఏటా మే 23న ‘ప్రపంచ తాబేళ్ల దినోత్సవం’గా జరుపుకోవాలని 2000లో తీర్మానించింది.
2025 నినాదం: Dancing Turtles Rock!