Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 12, 2026
Current Affairs
ప్రపంచ టాప్‌-100 పోర్ట్‌ల్లో విశాఖ
ప్రపంచ టాప్‌-100 పోర్ట్‌ల్లో విశాఖ
  • దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్‌-100లో ఒకటిగా విశాఖ పోర్ట్‌ స్థానం దక్కించుకున్నట్లు కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ 2026, జనవరి 10న పేర్కొన్నారు. విశాఖలో రూ.305 కోట్లతో దేశంలోనే అత్యాధునిక షిప్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. 
  • విశాఖలోని సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్ట్‌ అథారిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు సోనోవాల్‌ శంకుస్థాపన చేశారు. ‘మారిటైం ఇండియా విజన్‌ 2030’, ‘మారిటైం అమృత్‌కాల్‌ విజన్‌ 2047’ రెండూ భారత నౌకాయాన అభివృద్ధికి ప్రకటించారన్నారు.