దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్).. ప్రపంచంలోని టాప్-100 ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది.
2024కు సంబంధించి అత్యుత్తమ ఆసుపత్రుల పేరుతో న్యూస్‌వీక్, స్టాటిస్టా రూపొందించిన జాబితాలో అది 97వ స్థానాన్ని దక్కించుకుంది.
ఆరోగ్య సేవలు, అత్యాధునిక వైద్య పరిశోధనలు, అందుబాటు ధరల్లో చికిత్స వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమ ఆసుపత్రులను ఎంపిక చేశారు.
ఈ జాబితాలో- మేదాంత (గురుగ్రామ్) 146వ ర్యాంకు, చండీగఢ్‌లోని ది పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ 228వ ర్యాంకు పొందాయి.