Published on Mar 8, 2025
Current Affairs
ప్రపంచ జూనియర్‌ చెస్‌
ప్రపంచ జూనియర్‌ చెస్‌

బెంగళూరుకు చెందిన ప్రణవ్‌ వెంకటేష్‌ ప్రపంచ జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ (అండర్‌-20) సాధించాడు. 2025, మార్చి 7న మాంటెనెగ్రోలోని పెట్రోవాచ్‌లో జరిగిన టోర్నీలో చివరిదైన 11వ రౌండ్లో ప్రణవ్‌.. మాటిచ్‌ లెవ్రెనిచ్‌ (స్లొవేనియా)తో గేమ్‌ను డ్రా చేసుకుని టైటిల్‌ అందుకున్నాడు. అతడు 7 విజయాలు, 4 డ్రాలతో మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 

భారత్‌ నుంచి ఇంతకుముందు ఓపెన్‌ విభాగంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్‌ గుప్తా (2008) జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. 17 ఏళ్ల విరామం తర్వాత ప్రణవ్‌ ఈ ఘనతను అందుకున్నాడు.