Published on Oct 16, 2024
Current Affairs
ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక
ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతరంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సర్వే చేసింది. ఇందులో భాగంగా నీట్‌ (నాట్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్‌- చదువు, కొలువు, శిక్షణలో లేనివారు) విభాగంలో ఏయే ఏదేశాల్లో ఎంత మంది ఉన్నారో అధ్యయనం చేశారు. 

ఆ లెక్కల ప్రకారం... నీట్‌ (చదువు, కొలువు, శిక్షణలో లేనివారు) కేటగిరీలో యువతరం సంఖ్య గతంతో పోలిస్తే భారత్‌లో తగ్గుతూ వస్తుంది. 2019లో నీట్‌లో భాగమైన యువతరం సంఖ్య భారత్‌లో 31.2 శాతం కాగా... 2023లో అది 23.5 శాతానికి తగ్గింది. అయినప్పటికీ 2023లో ప్రపంచ సగటు (20.4%) కంటే భారత్‌లోనే ఎక్కువ (23.5%) మంది ఈ విభాగంలో ఉన్నట్లు ఐఎల్‌ఓ అధ్యయనం తేల్చింది.