Published on Jun 9, 2025
Current Affairs
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం

మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా జూన్‌ 7న ‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’గా నిర్వహిస్తారు.

జీవులు ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనాన్ని సాగించాలంటే ఆహార భద్రత అవసరం.

ఇది లేకుంటే ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది.

ప్రజల రోగనిరోధక శక్తి క్షీణించి, వ్యాధులు సంక్రమిస్తాయి.

ఆహార వృథాను అరికట్టడంపైనా ఈ రోజు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది.

చారిత్రక నేపథ్యం:

యూఎన్‌ఓకి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ), డబ్ల్యూహెచ్‌ఓ 2016లో సంయుక్తంగా ఆహార భద్రత ప్రాముఖ్యం గురించి ప్రజలకు తెలియజేయాలని భావించాయి.

దీనికోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకున్నాయి.

2017, జులైలో జరిగిన ఎఫ్‌ఏఓ 40వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్‌ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానించారు.

అదే ఏడాది డిసెంబరులో ఆ తీర్మానానికి డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు ప్రకటించింది.

2018, డిసెంబరు 20న జరిగిన యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీలోనూ దీనికి ఆమోదం లభించింది.

2019 నుంచి ఏటా జూన్‌ 7న ఈ రోజును నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: Food safety: science in action