స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 2026, జనవరి 19న ప్రాంభమైంది. దేశ విదేశాల నుంచి 3,000 మందికిపైగా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఇందులో 400 మంది రాజకీయ నేతలు ఉండగా, వారిలో 64 మంది దేశాధినేతలున్నారు. 1,000 మంది సీఈవోలు సదస్సులో పాల్గొన్నారు.
దావోస్ పర్వతాల మధ్య ఉండే అతి శీతల ప్రాంతం. 1880లో ఐరోపాలో టీబీ మహమ్మారి పీడించేది. దీంతో చాలా మంది స్వచ్ఛమైన గాలి కోసం దావోస్ పర్వత ప్రాంతాలకు వెళ్లేవారు. అలా వెళ్లినవారు అక్కడే ఒక చర్చిని నిర్మించారు. అదే చర్చి.. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వేదికగా నిలుస్తోంది.
1971 నుంచి ఏటా జనవరిలో ఈ సదస్సు జరుగుతోంది. తొలుత ఈ సదస్సును యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరం నిర్వహించేది. మొదటి సదస్సుకు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ స్వాబ్.. 400 మంది ఐరోపా వ్యాపారవేత్తలను పిలిచారు. ఆ తర్వాతి నుంచి అది ప్రపంచ దేశాల నేతల ఆర్థిక చర్చలకు వేదికగా నిలుస్తూ వస్తోంది.
జెనీవా కేంద్రంగా ఏర్పడిన డబ్ల్యూఈఎఫ్ ఏటా ఈ సదస్సును నిర్వహిస్తోంది. 2026లో జరిగింది 56వ సదస్సు.