Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 11, 2026
Current Affairs
ప్రపంచ అవినీతి సూచీ 2025
ప్రపంచ అవినీతి సూచీ 2025
  • ప్రపంచ అవినీతి సూచీ-2025ను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ 2026, ఫిబ్రవరి 10న విడుదల చేసింది. భారత్‌లో అవినీతి తగ్గుముఖం పట్టిందని సంస్థ వెల్లడించింది. ప్రపంచ అవినీతి సూచీ 2024లో 96వ స్థానంలో ఉన్న భారత్‌ 2025 నాటికి 91వ స్థానానికి ఎగబాకిందని పేర్కొంది. 
  • విభిన్న కసరత్తులు, నిపుణుల విశ్లేషణలు, సర్వేల ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. ఇందులో 0 పాయింట్లు సాధించిన దేశం పూర్తి అవినీతిమయమని, 100 పాయింట్లు పొందిన దేశంలో అవినీతి లేనేలేదని అర్థం.
  • డెన్మార్క్‌ 100కు 89 పాయింట్లు పొంది అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా అగ్రభాగాన నిలిచింది. తదుపరి రెండు స్థానాలు ఫిన్లాండ్, సింగపూర్‌లకు దక్కాయి.