ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బరిలో దిగే భారత జట్టుకు స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించనున్నాడు.
2025, సెప్టెంబరు 13 నుంచి 21 వరకు టోక్యోలో జరిగే ఈ పోటీల కోసం 19 మంది క్రీడాకారులతో భారత జట్టును జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఆగస్టు 31న ప్రకటించింది.
నీరజ్‌తో పాటు సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ జావెలిన్ త్రోలో పోటీపడనున్నారు.
భారత్ నుంచి నలుగురు జావెలియన్ త్రోయర్లు ప్రపంచ టోర్నీలో పాల్గొంటుండటం ఇదే మొదటిసారి.