Published on Sep 17, 2025
Current Affairs
ప్రపంచ అథ్లెటిక్స్‌
ప్రపంచ అథ్లెటిక్స్‌

ప్రపంచ అథ్లెటిక్స్‌

కెన్యా అథ్లెట్‌ ఫెయిత్‌ కిప్‌యెగాన్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌లో నాలుగోసారి మహిళల 1500 మీటర్ల పరుగు విజేతగా నిలిచింది.

2025, సెప్టెంబరు 16న టోక్యోలో జరిగిన మ్యాచ్‌లో 3 నిమిషాల 52.15 సెకన్లలో ఆమె రేసు పూర్తి చేసింది.

అత్యధిక సార్లు 1500మీ ప్రపంచ టైటిల్‌ గెలిచిన రన్నర్‌గా మొరాకో దిగ్గజం హిచమ్‌ ఇ గ్వెరౌజ్‌ సరసన ఫెయిత్‌ నిలిచింది. 

కెన్యాకే చెందిన డోర్కస్‌ ఎవోయ్‌ (3:54.92) రజతం నెగ్గగా.. ఆస్ట్రేలియా అమ్మాయి జెస్సికా హల్‌ (3:55.16) కాంస్య పతకం గెలుచుకుంది.