Published on Oct 16, 2024
Current Affairs
ప్రపంచంలో అతితక్కువ దూరం ప్రయాణించే విమానం
ప్రపంచంలో అతితక్కువ దూరం ప్రయాణించే విమానం

స్కాట్లాండ్‌లోని ఓర్క్‌నీ దీవుల్లో వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే ప్రాంతాల మధ్య విమానాలు కేవలం ఒకటిన్నర నిమిషాల్లోనే తమ ప్రయాణాన్ని పూర్తిచేస్తున్నాయి. వీటి మధ్య దూరం కేవలం 1.7 మైళ్లు. ఆ ప్రాంతాల మధ్య వంతెన లేకపోవడంతో లోగాన్‌ ఎయిర్‌ సంస్థ అక్కడ విమాన సేవలు అందిస్తోంది. విమానం టేకాఫ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు 90 సెకన్లు (ఒకటిన్నర నిమిషాలు) మాత్రమే పడుతుంది. ఇందుకోసం వాడే చిన్న విమానాల్లో కేవలం పది ప్యాసింజర్‌ సీట్లు ఉంటాయి.