Published on May 30, 2025
Current Affairs
ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన
ప్రపంచంలోనే ఎత్తయిన వంతెన

మణిపుర్‌లో ఇటు రవాణాకు, అటు వ్యూహాత్మకంగానూ ఉపయోగపడే వంతెన - 164 (నోనీ బ్రిడ్జి) నిర్మాణాన్ని భారతీయ రైల్వే పూర్తి చేసింది.

141 మీటర్ల ఎత్తు ఉండే ఈ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే పియర్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందింది.

ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) సరికొత్త ఘనత సాధించింది. 

111 కి.మీ.ల జిరిబామ్‌-ఇంఫాల్‌ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మించారు.