Published on Nov 27, 2024
Current Affairs
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ టిన్నిస్‌వుడ్‌ 2024, నవంబరు 25న ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌ నగర సమీపంలో గల శరణాలయంలో మృతిచెందారు.

ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకొన్న జాన్‌ ఆల్‌ఫ్రెడ్‌ గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. 

చారిత్రక విషాదమైన టైటానిక్‌ ఓడ మునిగిన 1912లో పుట్టిన ఈయన రెండు ప్రపంచయుద్ధాల కాలంలో జీవించారు.