ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్మాణానికి చైనా ఆమోదముద్ర వేసింది.
భూమిపై ఇప్పటి వరకూ నిర్మితమైన ప్రాజెక్టులన్నిటి కంటే పెద్దదైన దీని నిర్మాణ వ్యయం 137 బిలియన్ డాలర్లు.
టిబెట్‌లో భారత సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్రా నదిపై నిర్మించనుంది.
టిబెట్‌లో యార్లంగ్ జంగ్బో నదిగా ప్రసిద్ధమైన బ్రహ్మపుత్ర నదిపై జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
హిమాలమ పర్వతాల్లోని ఒక విశాల అగాధంలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు.