Published on Dec 31, 2026
Current Affairs
ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి
ప్రపంచంలోకెల్లా అతిసూక్ష్మ, స్వతంత్ర రోబోల సృష్టి
  • ప్రపంచంలోకెల్లా అత్యంత సూక్ష్మ పరిమాణంలోని స్వతంత్ర రోబో ఆవిష్కృతమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మిషిగన్‌ యూనివర్సిటీల పరిశోధకులు దీన్ని సృష్టించారు. ఇవి 200×300×50 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కాంతి ద్వారా శక్తిని పొందే ఈ చిట్టి రోబోలు స్థానిక ఉష్ణోగ్రతలను పసిగట్టి ముందుకు కదులుతాయి.
  • కణాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే సామర్థ్యం వీటి సొంతం. అతిచిన్న సాధనాలను రూపొందించడంలో ఇవి కీలకంగా మారనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.