బెల్జియం రాకుమారి ప్రిన్సెస్ ఆస్ట్రిడ్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025, మార్చి 4న సమావేశమయ్యారు.
వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంతో రెండు దేశాల ప్రజలకూ అంతులేని అవకాశాలు పెంపొందాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య పెంపుదల, పెట్టుబడుల ద్వారా సహకారం అందించడానికి ఉద్దేశించిన ఒక ఆర్థిక సహకార మిషన్‌లో భాగంగా బెల్జియం రాకుమారి భారత్ సందర్శనకు వచ్చారు.