Published on Aug 30, 2025
Current Affairs
ప్రధాని మోదీతో జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబ భేటీ
ప్రధాని మోదీతో జపాన్‌ ప్రధాని షిగెరు ఇషిబ భేటీ

జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2025, ఆగస్టు 29న టోక్యోలో ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబతో భేటీ అయ్యారు. సాంకేతికత, కృత్రిమ మేధ, వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం గురించి చర్చించారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్లు, శుద్ధ ఇంధనం, టెలికం, ఔషధాలకు సంబంధించి 13 ఒప్పందాలు ఖరారయ్యాయి. 50,000 మంది నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులను అయిదేళ్లలో భారత్‌ నుంచి జపాన్‌కు పంపించడం వీటిలో ఒకటి. జపాన్‌ సిగ్నల్‌ వ్యవస్థపై పనిచేసే ‘షింకన్‌సేన్‌ ఇ 10 సీరీస్‌’ రైళ్లను 2030 నాటికి భారత్‌కు ఇస్తామని జపాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.