Published on Apr 22, 2025
Current Affairs
‘ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన’ అవార్డు
‘ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన’ అవార్డు

ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన’ ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 5 బ్లాక్‌లు ఎంపిక కాగా వాటిలో  ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం ఉత్తమ ఆకాంక్షిత మండలంగా నిలిచింది. ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంను సమర్థంగా అమలు చేసి మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసినందుకు రాజర్షిషాకు 17వ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ఏప్రిల్‌ 21న ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.