Published on Sep 19, 2024
Current Affairs
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి నివేదిక తెలిపింది. ‘రిలేటివ్‌ ఎకనామిక్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌: 1960-61 టు 2023-24’ పేరుతో కౌన్సిల్‌ సభ్యులు సంజీవ్‌సన్యాల్, ఆకాంక్ష అరోడాలు రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 

నివేదికలోని ముఖ్యాంశాలు:

* స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9%.

* జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వాటా 1960-61లో 7.7% ఉండగా, 2023-24 నాటికి 9.7 శాతానికి చేరింది. 2010-11లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 4.6%, తెలంగాణ వాటా 3.8% ఉండగా, 2023-24 నాటికి ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9 శాతానికి చేరాయి. 

* జాతీయసగటుతో పోలిస్తే 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం 193.6% అధికంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం 131.6% అధికంగా ఉంది.