పారాలింపిక్స్‌లో మహిళల 200 మీటర్ల టీ35 పరుగులో ప్రీతి పాల్ కాంస్యం సాధించింది. ఫైనల్లో ఆమె వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. 30.01 సెకన్లలో రేసు ముగించింది. చైనా స్ప్రింటర్లు జియా (28.15సె), చియాన్‌చిన్ (29.09సె) వరుసగా స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.