తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మికి అత్యున్నత ప్రతిభా పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి గిరిరాజ్‌సింగ్ చేతులమీదుగా ఆమె 2026, ఫిబ్రవరి 23న దిల్లీలో అందుకున్నారు. దిల్లీలో జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్(ఎన్‌హెచ్‌డీసీ) 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రాష్ట్రం నుంచి విజయలక్ష్మికి పురస్కారం ప్రదానం చేశారు.