Published on Aug 14, 2025
Current Affairs
పూర్ణిమ తణుకు
పూర్ణిమ తణుకు

బ్రిటన్‌ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన కమాండర్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (సీబీఈ) అవార్డుని ఇటీవల తెలుగు మహిళ పూర్ణిమ తణుకు అందుకున్నారు.

కింగ్‌ చార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ అనీ దీన్ని ఆమెకు అందించారు.

ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, నోబెల్‌ గ్రహీత హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌తోపాటు మనదేశం నుంచి ఈ గౌరవాన్ని పొందినవారిలో లీనా నాయర్‌ ఒకరు. 

పూర్ణిమ స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట.

ప్రస్తుతం ఆమె నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీఎన్‌ఏ)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇది యూకేలో బాలల సంరక్షణ, హక్కులకోసం పనిచేసే అతిపెద్ద ఛారిటీ-మెంబర్‌షిప్‌ అసోసియేషన్‌.