స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 27న గగనవిహారం చేశారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన ఆమె.. 25 నిమిషాలపాటు కో పైలట్‌గా వ్యవహరించారు. తద్వారా పోరాట హెలికాప్టర్‌లో ఆకాశయానం చేసిన తొలి రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్ వైమానిక స్థావరం నుంచి రాష్ట్రపతి హెలికాప్టర్ టేకాఫ్ అయింది.
ఎల్‌సీహెచ్ ‘ప్రచండ్’ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పోరాట హెలికాప్టర్.