మొత్తం 156 ప్రచండ్ హెలికాప్టర్ల కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో రూ.62,700 కోట్ల విలువైన రెండు ఒప్పందాలను రక్షణ శాఖ 2025, మార్చి 28న కుదుర్చుకుంది.
ఇందులో వాయుసేనకు 66, సైన్యానికి 90 హెలికాప్టర్లు చేరతాయి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత తొలి తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’.
ఇది 5వేల మీటర్లకుపైగా ఎత్తుకు చేరుకోగలదు. పర్వత ప్రాంతాల్లో అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు.