2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 25% వృద్ధితో 151.5 లక్షల మెట్రిక్ టన్నులకు, బాస్మతీ బియ్యం 8% పెరిగి 64 లక్షల మెట్రిక్ టన్నులు తరలి వెళ్లినట్లు వివరించింది.
ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ఇది సాధ్యమైంది. దేశీయంగా దిగుబడులు పెరిగినందునే, బియ్యం ఎగుమతులకు మన ప్రభుత్వం అనుమతించింది.