- ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు మరో రెండు జిల్లాలను చేరుస్తూ 2025, డిసెంబరు 29న రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించింది. రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉంటుంది.
- మొత్తంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 26 నుంచి 28కి పెరిగింది.