మనదేశంలో మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 356 గిగావాట్లు కాగా, 2025 నాటికి అది దాదాపు 475 గిగావాట్లకు విస్తరించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటు కావడం దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం 2019లో 81 గిగావాట్లు మాత్రమే. కానీ 2030 నాటికి అయిదురెట్లకు పైగా వృద్ధి చెంది 430 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌర, పవన విద్యుత్తు ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నందున ఈ విభాగాల్లో కొత్త యూనిట్లు అధికంగా ఏర్పాటయ్యే అవకాశం కలుగుతోంది.