అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసాకు చెందిన ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ వ్యోమనౌక సరికొత్త భగభగ మండే సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లి, అక్కడి నుంచి సురక్షితంగా వెలుపలికి వచ్చింది.
తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.
సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018లో నాసా ప్రయోగించింది.
అంతరిక్ష వాతావరణం, సౌర తుపాన్లు, సౌర జ్వాలల గురించి లోతుగా తెలుసుకోవడం ఈ ప్రయోగ ఉద్దేశం. ఏడేళ్లు పనిచేసేలా ఈ వ్యోమనౌకను రూపొందించారు.
పార్కర్ సోలార్ ప్రోబ్ 21 సార్లు సూర్యుడికి చేరువగా వెళ్లింది. తొలిసారి 2021 ఏప్రిల్ 28న కరోనాలోకి ప్రవేశించింది.
డిసెంబరు 24న మాత్రం ఇంతకుముందున్నెడూ లేనంత దగ్గరగా వెళ్లింది. సూర్యుడికి భూమికి మధ్య దూరం ఒక మీటరు అని భావిస్తే, పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడికి 4 సెంటీమీటర్ల మేర చేరువగా వెళ్లింది.
ఈ వ్యోమనౌక 2025, మార్చి 22న, జూన్ 19న సూర్యుడికి ఇంతే చేరువగా వెళ్లి వస్తుంది.