Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 21, 2026
Current Affairs
ప్యాక్స్‌ సిలికా కూటమిలో భారత్‌
ప్యాక్స్‌ సిలికా కూటమిలో భారత్‌
  • అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్‌ సిలికా’లో భాగస్వామిగా భారత్‌ 2026, ఫిబ్రవరి 20న చేరింది. దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, అమెరికా ఆర్థిక వ్యవహారాల ఉప మంత్రి జాకబ్‌ హెల్‌బర్గ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
  • కీలక ఖనిజాలు, కృత్రిమ మేధ విషయాల్లో ఒక దేశ గుత్తాధిపత్యాన్ని అంతం చేయడానికి ఈ కూటమి ఏర్పడినట్టు హెల్‌బర్గ్‌ పేర్కొన్నారు.