పాముకాటు మరణాలు దక్షిణాది రాష్ట్రాల్లోనే అధికంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌సింగ్ 2026, మార్చి 30న లోక్‌సభలో తెలిపారు. 2023-25 మధ్య దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పాముకాటుకు గురై 984 మంది చనిపోగా అందులో 431 మంది (43.80%) కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. ఇందులో అత్యధికంగా కర్ణాటకలో 277 మంది, తమిళనాడులో 95 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 59 మంది ఉన్నారు. ఏపీలో 2024లో అత్యధికంగా 41 మంది పాముకాటుకు బలయ్యారు.