ఆంధ్రప్రదేశ్‌లో 2022-24 మధ్య మూడేళ్ల కాలంలో 13,901 మంది పాముకాటుకు గురికాగా.. అందులో 48 మరణాలు సంభవించాయి.
2024లో దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో (370) ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
ఆ ఏడాది కర్ణాటకలో 101, పశ్చిమబెంగాల్‌లో 69 మంది మృతి చెందగా.. ఏపీలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
2025, మార్చి 21న లోక్‌సభలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి ప్రతాప్‌రావు జాదవ్ ఈ వివరాలు వెల్లడించారు.