Published on Apr 22, 2025
Current Affairs
పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణం
పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణం

క్యాథలిక్కుల అత్యున్నత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ (88) 2025, ఏప్రిల్‌ 21న కన్నుమూశారు.

వాటికన్‌ చరిత్రలో తొలి లాటిన్‌ అమెరికన్‌ పోప్‌గా చరిత్ర సృష్టించిన ఫ్రాన్సిస్‌ అర్జెంటీనాకు చెందినవారు.

జీసస్‌ సొసైటీ నుంచి క్యాథలిక్‌ చర్చికి నేతృత్వం వహించిన తొలి వ్యక్తీ ఆయనే. పోప్‌ అసలు పేరు జోర్జ్‌ మారియో బెర్గోగ్లియో.

ఇటలీ సంతతికి చెందిన ఆయన 1936 డిసెంబరు 17వ తేదీన అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఉన్న ఫ్లోర్స్‌లో జన్మించారు.

2013 ఫిబ్రవరి 28న పోప్‌ బెనెడిక్ట్‌-16 రాజీనామా చేశాక అదే ఏడాది మార్చి 13వ తేదీన బెర్గోగ్లియోను 266వ పోప్‌గా ఎన్నుకున్నారు.

అప్పటి నుంచి ఆయన తన పేరును పోప్‌ ఫ్రాన్సిస్‌గా మార్చుకున్నారు. అప్పుడు ఆయన వయసు 76 ఏళ్లు.