శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అన్ని డిజిటల్ వ్యవస్థల్లో ‘సామాన్య వ్యాపార గుర్తింపు’గా చేయడం కోసం రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను కేంద్రం ప్రకటించింది.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) 2024, నవంబరు 25న ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసింది.