పినాక బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థకు సంబంధించి ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ (ఈఈఎల్), మునిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)లో రక్షణ శాఖ 2025, ఫిబ్రవరి 6న ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం విలువ రూ.10,147 కోటు.
మల్టీ బ్యారెల్ రాకెట్ వ్యవస్థలో ఉపయోగించే మందుగుండు సామగ్రి అయిన ఒకటో టైపు ఏరియా డినయల్ మ్యూనిషన్ కొనుగోలుతోపాటు అధిక పేలుడు సామర్థ్యం కలిగివుండి ఎక్కువ దూరం ప్రయాణించే రాకెట్ల సేకరణ ఈ కాంట్రాక్టులో భాగం.
రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.