రక్షణ పరిశోధన- అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) పినాక గైడెడ్ ఆయుధ వ్యవస్థల్ని 2024, నవంబరు 14న విజయవంతంగా పరీక్షించింది.
సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ముందు మరోసారి పరీక్షను నిర్వహించారు. అవి చేరగలిగే దూరం, కచ్చితత్వం వంటి వేర్వేరు అంశాలను దీని ద్వారా మదించారు.
భిన్న ప్రదేశాల నుంచి మూడు దశల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణశాఖ తెలిపింది. రెండు లాంఛర్ల నుంచి 12 చొప్పున రాకెట్లను దీనికోసం వాడినట్లు వెల్లడించింది.