2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల తొలి విడత ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 2025, ఏప్రిల్ 28న జరిగింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 57 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన జీర్ణకోశ వ్యాధుల ప్రముఖ వైద్య నిపుణుడు డి. నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలు పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.