- భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2025, డిసెంబరు 5న శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆరోగ్యం, ఆహార భద్రత, నౌకాయానం, ఎరువులు, విద్య, భారత్ నుంచి రష్యాకు నిపుణులైన కార్మికుల వలస తదితర రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు ఇవి దోహదపడనున్నాయి.
- భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇందుకుగానూ అయిదేళ్ల కాలానికి ‘2030 ఆర్థిక కార్యక్రమం’ ప్రణాళికకు తుదిరూపునిచ్చాయి.