Published on Apr 4, 2025
Current Affairs
పీటోంగ్టార్న్‌ షినవాత్ర్‌తో మోదీ భేటీ
పీటోంగ్టార్న్‌ షినవాత్ర్‌తో మోదీ భేటీ

బిమ్‌స్టెక్‌ శిఖరాగ్ర సదస్సు కోసం థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధానమంత్రి పీటోంగ్టార్న్‌ షినవాత్ర్‌తో 2025, ఏప్రిల్‌ 3న భేటీ అయ్యారు.

పర్యాటకం, విద్య, పెట్టుబడులు, సాంస్కృతిక వ్యవహారాలు సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడంపై విస్తృతంగా చర్చించారు.

సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు, చేనేత, హస్తకళల రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.