పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజినీర్, ఫిల్డ్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,543
వివరాలు:
ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 532
ఫీల్డ్ ఇంజినీర్ (సివిల్): 198
ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్): 535
ఫీల్డ్ సూపర్వైజర్ (సివిల్): 193
ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 85
అర్హత: కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ.30,000 నుంచి రూ.1,20,000; ఫీల్డ్ సూపర్వైజర్‌కు రూ.23,000- రూ.1,05,000.
వయోపరిమితి: 17.09.2025 నాటికి 29 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: టెక్నికల్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలు (ఇంగ్లిష్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్), ఫీల్డ్ ఇంజినీరింగ్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: దిల్లీ, భోపాల్, కోల్‌కతా, బెంగళూరు, గువాహటి, ముంబయి.
దరఖాస్తు రుసుము: ఫీల్డ్ ఇంజినీర్‌కు రూ.400. ఫీల్డ్ సూపర్వైజర్‌కు రూ.300.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17-09-2025.