Published on Oct 24, 2024
Government Jobs
పీజీసీఐఎల్‌లో డిప్లొమా ట్రైనీ, జూనియర్‌ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు
పీజీసీఐఎల్‌లో  డిప్లొమా ట్రైనీ, జూనియర్‌ ఆఫీసర్ ట్రైనీ పోస్టులు

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్‌/ కార్యాలయాల్లో డిప్లొమా ఇంజినీర్‌, జూనియర్‌ ఆఫీసర్ ట్రైనీ, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 802.

వివరాలు:

1. డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్): 600 పోస్టులు

2. డిప్లొమా ట్రైనీ (సివిల్): 66 పోస్టులు

3. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (హెచ్‌ఆర్‌): 79 పోస్టులు

4. జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 35 పోస్టులు

5. అసిస్టెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 22 పోస్టులు

పీజీసీఐఎల్‌ రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌, ఒడిషా ప్రాజెక్ట్స్‌, కార్పొరేట్ సెంటర్‌.

విభాగాలు: ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ హెచ్‌ఆర్‌/ ఎఫ్‌&ఎ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీబీఏ/ బీబీఎం/ బీబీఎస్‌, బీకాం, ఇంటర్‌ సీఏ/ ఇంటర్‌ సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయో పరిమితి: 12.11.2024 నాటికి 27 ఏళ్లు మించకూడదు. 

పే స్కేల్: నెలకు అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.21,500-రూ.74,000. ఇతర పోస్టులకు రూ.24,000-రూ.1,08,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), కంప్యూటర్ స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ ట్రైనీ పోస్టుకు రూ.200. ఇతర పోస్టులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12-11-2024.

రాత పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2025.

Website:https://www.powergrid.in/

Apply online:https://careers.powergrid.in/recruitment-nextgen/h/login.aspx