Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 5, 2026
Apprenticeship
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్‌) దేశవ్యాప్తంగా పీజీసీఐఎల్‌ కేంద్రాలు/ ప్రాజెక్ట్‌/ రీజియన్లలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 188

వివరాలు:

పీజీసీఐఎల్‌ కేంద్రం/ ప్రాజెక్ట్‌/ రీజియన్: నార్తెర్న్‌ రీజియన్‌-I (హరియాణా; యూపీ, రాజస్థాన్‌), వెస్ట్రన్ రీజియన్-I (మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌), వెస్ట్రన్ రీజియన్-II- (మధ్య ప్రదేశ్‌, గుజరాత్), సదరన్ రీజియన్-II (కర్ణాటక, తమిళనాడు).

ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ అప్రెంటిస్ పోస్టులు

విభాగాలు/ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, సివిల్.

అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.  

అప్రెంటిస్‌షిప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.

నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13,500; డిప్లొమా ట్రేడ్ రూ.15,000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్‌భాష అసిస్టెంట్ రూ.17,500.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.03.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11.03.2026.

Website:https://www.powergrid.in/en/