దిల్లీలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా పీఎస్‌బీ శాఖల్లో లేటరల్ రిక్రూట్‌మెంట్ విధానంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 213.
వివరాలు:
1. ఆఫీసర్: 56 పోస్టులు
2. మేనేజర్: 117 పోస్టులు
3. సీనియర్ మేనేజర్: 33 పోస్టులు
4. చీఫ్ మేనేజర్: 07 పోస్టులు
విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజ్‌భాష, హ్యూమన్ రిసోర్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, సైబర్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఫారెక్స్, పబ్లిక్ రిలేషన్ అండ్ పబ్లిసిటీ, కార్పొరేట్, ఐఎస్ ఆడిటర్, సైబర్ ఫోరెన్సిక్స్, వెబ్ డెవలపర్, ఎస్‌క్యూఎల్ డెవలపర్, చార్టర్డ్ అకౌంటెంట్, లా మొదలైనవి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, సీఐఐఐబీ, పీజీడీబీఏ, పీజీడీబీఏం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
పే స్కేల్: నెలకు ఆఫీసర్‌కు రూ.48,480- 85,920. మేనేజర్‌కు రూ.64,820- 93,960. సీనియర్ మేనేజర్‌కు రూ.85,920- 1,05,280. చీఫ్ మేనేజర్‌కు రూ.1,02300- 1,20940 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ మొదలైన వాటి ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ కేటగిరీకి రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు, దరఖాస్తు సవరణకు చివరి తేదీ: 15-09-2024.
Website:https://punjabandsindbank.co.in/content/recuitment
Apply online:https://ibpsonline.ibps.in/psbsoaug24/