పంజాబ్ సింథ్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్ మేనేజర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్ మేనేజర్స్: 30
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంబీఏ (మార్కెటింగ్ ఫైనాన్స్) చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి: 2025 నవంబర్ 1వ తేదీ నాటకి 25 ఏళ్ల నుంచి 33 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 నవంబర్ 26.