Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 7, 2026
Apprenticeship
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), దిల్లీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 5,138

వివరాలు:

రాష్ట్రీవారీ ఖాళీలు:

1. తెలంగాణ: 69

2. ఆంధ్రప్రదేశ్‌: 56

3. తమిళనాడు: 121

4. కర్ణాటక: 64

5. కేరళ: 83

6. ఒడిశా: 142

7. పాండిచ్చెరి: 02 

మిగతా పోస్టుల కోసం నోటిఫికేషన్‌ చూడవచ్చు.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్: నెలకు రూ. 12,300 - రూ.15,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600 నుంచి రూ.800. పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌ జెండర్లకు అభ్యర్థులకు రూ.200. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా. 

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 8. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 24. 

Website:https://pnb.bank.in/recruitments.aspx