పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 750
వివరాలు:
రాష్ట్రాల వారిగా ఖాళీలు..
1. తెలంగాణ: 50
2. ఆంధ్రప్రదేశ్: 80
3. కర్ణాటక: 65
4. ఒడిశా: 85
5. తమిళనాడు: 85
6. పుదుచ్చెరి: 05
7. ఛత్తీస్‌గఢ్: 40
8. గుజరాత్: 100
9. హిమాచల్ ప్రదేశ్: 30
10. ఝార్ఖండ్: 35
11. పంజాబ్: 60
12. అస్సాం: 15
13. మహారాష్ట్ర: 100
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 - 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.48,480 - రూ.85,920.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ. 100.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 4.
Website:https://punjabandsindbank.co.in/