పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ నోయిడా (పీజీఐసీహెచ్), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్ - 44
విభాగాలు: పీడియాట్రిక్ కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జరీ, అనస్థీషియా తదితర విభాగాలు...
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
గరిష్ట వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,20,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా facultyrecpgich@gmail.com కు పంపాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.5000. ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు రూ.3,500.
దరఖాస్తు చివరి తేదీ: 10-04-2026
Website:https://pgich.edu.in/recruitment.php