Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 26, 2026
Government Jobs
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1 ఉద్యోగాలు
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1 ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్), పీడియాట్రిక్స్ విభాగంలోని నియోబోర్న్ యూనిట్ ఒక పరిశోధన ప్రాజెక్ట్ కోసం వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1(నాన్‌-మెడికల్/మెడికల్): 02

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌-3: 02

3. ప్రాజెక్ట్ స్టాఫ్‌ నర్స్‌-2: 04  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, పీజీ, బీఫార్మసి, బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీహెచ్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు పోస్టులను అనుసరించి రూ.20,000 - రూ.67,000.

నియామక కాలం: ప్రారంభంలో 6 నెలల పాటు ఉంటుంది. పనితీరు & నిధుల లభ్యతను బట్టి పొడిగించే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌తో పాటు సీవీ, వయస్సు ధృవీకరణ, విద్యార్హతలు, అనుభవ పత్రాలు, ఎన్ఓసీ (NOC) వంటి పత్రాల హార్డ్ కాపీలను సమర్పించాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: నియోనాటాలజీ ఆఫీస్, రూమ్ నెం.05, లెవల్-III, ఎఫ్-బ్లాక్, నెహ్రూ హాస్పిటల్, పీజీఐఎంఈఆర్, చండీగఢ్.

ఎంపిక విధానం: అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే 09 మార్చి 2026 ఉదయం 9:30 గంటలకు రాత పరీక్ష నిర్వహించవచ్చు. ఇంటర్వ్యూ అదే రోజు మధ్యాహ్నం ఉండే అవకాశం ఉంది.

చివరి తేదీ: 06 మార్చి 2026, సాయంత్రం 4:00 గంటల వరకు.

Website:https://pgimer.edu.in/PGIMER_PORTAL/PGIMERPORTAL/Vacancies/JSP/VACANCIE_VIEW.jsp?countt=0