తక్కువ దూరం ప్రయాణాలకు ఉపయోగపడే, 2 ఇంజిన్ల న్యారోబాడీ ఎస్‌జే-100 విమానాలను తయారు చేసే రష్యా కంపెనీ యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ (పీజేఎస్‌సీ-యూఏసీ)తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్) మాస్కోలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎస్‌జే-100 విమానాలను మనదేశంలోనూ తయారు చేస్తారు. ఇప్పటివరకు ఈ మోడల్ విమానాలు 200 తయారవ్వగా, 16 విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి.