ఆంధ్రప్రదేశ్‌కు 2024లో 617 పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2025, జనవరి 4న వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 3వేల మందికిపైగా జనాభా ఉన్న 4,604 గ్రామ పంచాయతీలకు భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వగా అందులో అరుణాచల్‌ప్రదేశ్ (661) తర్వాత అత్యధికంగా ఏపీకి 617 భవనాల నిర్మాణానికి నిధులు మంజూరుచేసినట్లు పేర్కొంది. అలాగే 1,422 కంప్యూటర్లు ఇచ్చినట్లు తెలిపింది.