Published on Apr 9, 2025
Current Affairs
పంచాయతీ పురోగతి సూచిక
పంచాయతీ పురోగతి సూచిక

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022-23 నాటికి దేశంలోని గ్రామ పంచాయతీలు సాధించిన పురోగతి ఆధారంగా కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2025, ఏప్రిల్‌ 8న ‘పంచాయతీ పురోగతి సూచిక’ను విడుదల చేసింది. పేదరిక నిర్మూలన, పంచాయతీలలో జీవనోపాధుల పెంపు, ఆరోగ్యం, చిన్నారులకు అనుకూలమైన సౌకర్యాల కల్పన, తాగునీరు..పారిశుద్ధ్యం..పచ్చదనం, మౌలిక వసతుల్లో స్వావలంబన, సామాజిక భద్రత, సుపరిపాలన, మహిళలకు అనుకూలమైన విధానాలు అనే తొమ్మిది కొలమానాల ఆధారంగా పంచాయతీల పనితీరును మదింపు చేశారు. 

వాటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ.. అవి సాధించిన పురోగతికి సంబంధించిన సూచికలను నిర్ధారించింది. అందులో రాష్ట్రాల వారీగా టాప్‌-25 పంచాయతీల పేర్లు ప్రకటించింది. అందులో దేశంలోని ఏ పంచాయతీకీ అచీవర్స్‌ హోదా దక్కలేదు. గుజరాత్‌లోని 346, తెలంగాణలో 270 పంచాయతీలు ఏ గ్రేడ్‌ (ఫ్రంట్‌ రన్నర్‌) దక్కించుకుని తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.